కిందపడేసి చితకబాదారు : బెంగాల్ లో.. బీజేపీ నేతపై దాడి

BJPబెంగాల్ లో బీజేపీ నేతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. శుక్రవారం (ఏప్రిల్-6) కార్ లో వెళ్తున్న బెంగాల్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్యామపాద మొండల్ ను అత్యంత దారుణంగా కొట్టారు. కార్ లో వెళ్తున్న ఆయన్ని …ముసుగులు వేసుకుని వచ్చిన కొందరు వ్యక్తులు శ్యామపాద్ పై దాడి చేశారు. రాళ్లు, ఇటుకలతో కారు అద్దాలు పగులగొట్టారు. తర్వాత మొండల్ ను కారులోంచి బయటకు గుంజుకొచ్చి… కిందపడేసి చితకబాదారు. అయితే దాడి చేసింది అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలని అనుమానిస్తున్నారు. కొద్దిదూరంలోనే పోలీసులున్నా… వారు ఏమీ చేయలేకపోయారు.

Posted in Uncategorized

Latest Updates