కికీ ఛాలెంజ్ పై పోలీసుల వార్నింగ్ : రోడ్లపై డ్యాన్స్ చేస్తే జైలుకే


ప్రపంచవ్యాప్తంగా కుర్రకారుని ఊపేస్తున్న కికీ సాంగ్.. పీల్ మై ఛాలెంజ్ ఇప్పుడు తలనొప్పిగా మారింది. సెలబ్రిటీలు అందరూ కూడా రన్నింగ్ కారు దిగి.. కారుతోపాటే నడుస్తూ డ్యాన్స్ చేయటం. సినీ హీరోయిన్స్, హీరోలు సైతం కికీ ఛాలెంజ్ చేస్తున్నారు. రెజీనా, ఆదాశర్మ మరికొందరు హీరోయిన్స్ ఇలాగే చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. వీరిని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీనికితోడు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. రన్నింగ్ లోని కారు నుంచి దిగటం.. రోడ్డుపై డ్యాన్స్ చేయటం.. మళ్లీ ఎక్కటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే విధంగా ఆ రోడ్లపై వెళ్లే మిగతా వారిని కూడా ఇది డైవర్ట్ చేస్తోంది. దీంతో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి.

హైదరాబాద్ లోనూ ఇది పెరిగిపోతుండటంతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. వార్నింగ్ ఇచ్చారు. కికీ ఛాలెంజ్ చేసేవారిపై న్యూసెన్స్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చి డ్యాన్సులతో రోడ్లపై హంగామా చేయొద్దని సూచించారు. అర్థం పర్థం లేని ఛాలెంజ్ లు స్వీకరించటం, వాటిని అనుకరించటం అనేది మంచిది కాదని సూచించారు. కికీ ఛాలెంజ్ పేరుతో డాన్సులు చేస్తే న్యూసెన్స్ కేసు కింద జైలుకి పంపిస్తామని హెచ్చరించారు హైదరాబాద్ సిటీ పోలీసులు.

#HYDTPweCareForU Restrain from #kikichallenge or count the bars.

Hyderabad Traffic Police 发布于 2018年7月31日周二

Posted in Uncategorized

Latest Updates