కికీ ఛాలెంజ్ సాహసాలు చేస్తే.. కఠిన చర్యలు : డీజీపీ

కికీ ఛాలెంజ్ స్వీకరించి సాహసాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఈ ఛాలెంజ్ వల్ల ఎదుటి వారి ప్రాణాలను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రన్నింగ్ వెహికల్ నుంచి దిగి కారుతోపాటు నడుస్తూ డాన్స్ చేయటం.. ఆ తర్వాత రన్నింగ్ కారు ఎక్కటం ప్రమాదకరం అన్నారు. ఈ ఛాలెంజ్ వల్ల కొన్ని ప్రమాదాలు జరిగినట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటివి ఎవరూ చేయొద్దని కోరారు డీజీపీ. నడుస్తున్న వెహికల్ నుంచి దిగి రన్నింగ్ లోనే డాన్స్ చేయటం అనేది ప్రాణాంతకం అన్నారు. రోడ్డుపై వెళ్లే మిగతా వారికీ ఇది డేంజర్ అన్నారు డీజీపీ.

కికీ ఛాలెంజ్ సాహసాలు చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు పోలీస్ బాస్. ఇలాంటి స్టంట్ల జోలికి యువకులు వెళ్లొద్దని సూచించారు. సురక్షితమైన డ్రైవింగ్ మంచిదన్నారు.

Posted in Uncategorized

Latest Updates