కిక్ కు ముందే తెలుసుకోండి : లిక్కర్ ధరలు చెప్పే యాప్

LIDరాష్ట్రంలో లిక్కర్ రేట్లు MRP కంటే ఎక్కువగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎక్సైజ్ మంత్రి పద్మారావు. శనివారం (ఫిబ్రవరి-10) లిక్కర్ ధరలపై ప్రత్యేక యాప్ రిలీజ్ చేశారు. ప్రతి బాండ్ పై ఎంత ధర ఉందో యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు మంత్రి. వైన్స్, బార్స్, క్లబ్బులు, రీసార్ట్స్ ల్లో MRP ఉల్లంఘనకు పాల్పడకుండా ఉండేందుకు యాప్ రిలీజ్ చేశామన్నారు.

మద్యం ధరల్లో దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం స్పెషల్ యాప్ ను ప్రవేశపెట్టిందన్నారు పద్మారావు. రాష్ట్రంలో 880 బ్రాండ్ల ధరల వివరాలను ఈ యాప్ లో తెలుసుకోవచ్చన్నారు. లిక్కర్ లో ఏదైనా అక్రమాలకు పాల్పడినవారిపై యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో సారాని నిషేధించడంలో పూర్తిగా సఫలమయ్యామన్నారు మంత్రి పద్మారావు. లిక్కర్ రేట్ల వ్యత్యాసాలు ఉన్నా.. ఎక్కువ వసూలు చేస్తున్నా.. మందుబాబులు ఈ వాట్సాప్ నెంబర్-7989111222, ఫోన్ నెంబర్-18004252523  సంప్రదించాలని సూచించారు..

Posted in Uncategorized

Latest Updates