కిచెన్ కన్నీళ్లు పెట్టింది : ఆధునిక నలభీముడు ఆంటోనీ ఆత్మహత్య

chefఆధునిక నలభీముడు.. ప్రపంచవ్యాప్తంగా మెచ్చిన చెఫ్ ఆంటోనీ బౌర్డేన్ ఆత్మహత్య చేసుకున్నారు. టీవీల్లో వంటల ప్రోగ్రామ్స్ ప్రారంభానికి ఆద్యుడు ఆయనే. CNN నెట్ వర్క్ లో వంటల కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అరుదైన, మంచి ఆహారాన్ని 30 సంవత్సరాలుగా ప్రజలకు పరిచయం చేస్తూ వస్తున్నారు ఆంటోనీ బౌర్డేన్. 61 సంవత్సరాల వయస్సులో.. ఫ్రాన్స్ లోని ఓ హోటల్ రూంలో జూన్ 8వ తేదీ శుక్రవారం ఉదయం చనిపోయి కనిపించారు. ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

ఆంటోనీ బౌర్డేన్.. తినని ఆహారం అంటూ ఏదీ లేదు. ప్రపంచంలోని దాదాపు అన్ని రకాల వంటకాలను రుచి చూసిన వ్యక్తి రికార్డ్ నెలకొల్పాడు. రుచికరమైన ఆహారంతోపాటు.. చెత్త ఫుడ్ కూడా తిన్న వ్యక్తిని నేనే అంటారు ఆయన. ఎన్నో ఛానల్స్ లో వంటలపై వేల ఎపిసోడ్స్ చేసిన ఘనత ఈయనదే. ఫుడ్, డ్రింక్ పై రాసిన ఓ పుస్తకం ఈ స్థాయిలో అమ్ముడుపోవటం కూడా ఓ రికార్డ్. కిచెన్ కాన్ఫడెంటల్ పేరుతో రాసిన పుస్తకానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో.. అన్ని ఆహార పదార్థాలను టేస్ట్ చేసిన వ్యక్తిగా ఆంటోనీ బౌర్డేన్ చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.

ప్రపంచ మొత్తం తిరుగుతూ తాను చేసిన వంటలు, డ్రింక్స్ పై రాసిన పుస్తకాలు ఎంతో పాపులర్ అయ్యాయి. హిజ్ లవ్ ఆఫ్ గ్రేట్ అడ్వంచర్, న్యూ ఫ్రెండ్స్, ఫైండ్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ ద రిమార్కబుల్ స్టోరీస్ పేరుతో పుస్తకాలు రచించారు. అసాధారణమైన స్టోరీ టెల్లర్ గా ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఆంటోనీ మరణంపై CNN నెట్ వర్క్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆప్తుడిని కోల్పోయాం అంటూ సంతాపం ప్రకటించింది. ప్రపంచంలోని భోజన ప్రియులు, ప్రముఖ చెఫ్ లు ఆంటోనీ ఆత్మహత్యతో షాక్ అయ్యారు. 61 ఏళ్ల వయస్సులో ఆయన ఈ విధంగా చేయటం ఏంటో అర్థం కావటం లేదు అంటున్నారు.

ఆంటోనీ బౌర్డేన్ రెండు వివాహాలు చేసుకున్నారు. ఇద్దరికీ విడాకులు ఇచ్చారు. 2007లో బూసియా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. 2016లో విడాకులు తీసుకున్నారు. రెండేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నారు. ఒంటరి తనమే ఆయన ఆత్మహత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. ఆయనకు ఓ కూతురు ఉంది. ఫ్రాన్స్ నుంచి ఆయన భౌతికకాయాన్ని అమెరికాలోని న్యూయార్క్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates