కిచెన్ టిప్ : కోడిగుడ్లు త్వరగా పాడవకుండా ఉండాలంటే..

కోడిగుడ్లను కొందరు ఎప్పటి కప్పుడు కొనుకొచ్చుకుంటే…మరి కొందరు ఎక్కువగా తీసుకుని ఇంట్లో స్టాక్ పెట్టుకుంటుంటారు. అయితే గుడ్లు త్వరగా పాడవకుండా..ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే అవి కొద్ది రోజులు నిల్వ ఉంటాయి. ఇందులో భాగంగా కోడిగుడ్లు ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. కానీ అది సరైంది కాదంటున్నారు నిపుణులు. ఫ్రిడ్జ్‌ డోర్‌లో ఉండే ర్యాక్‌లో గుడ్లను నిల్వ చేస్తే త్వరగా పాడయిపోతాయని పరిశోధనల్లో స్పష్టమైంది. ఫ్రిడ్జ్‌ డోర్‌ను తెరుస్తూ, మూస్తూ.. ఉండడంతో ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. ఇది గుడ్డులోని పచ్చసొనపై ప్రభావం చూపుతుంది. దీంతో గుడ్లు పాడైపోతాయని ఆహార నిపుణులు అంటున్నారు. కాబట్టి వాటిని క్లోజ్డ్‌ ట్రేలోనే పెట్టి ఫ్రిడ్జ్‌ లోపల పెట్టాలి.ఇలా చేయడంతో ఫ్రిడ్జ్‌ డోర్‌ తెరిచినప్పుడు ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు గుడ్లపై పెద్దగా ప్రభావం చూపించవు. లేదంటే స్థిర ఉష్ణోగ్రత ఉన్న దగ్గర వాటిని నిల్వ ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వాటర్‌ బాటిళ్లు, సోడా వంటివి నిల్వ చేయడానికి ఫ్రిడ్జ్‌ డోర్‌లోని ర్యాక్స్‌ అనువైనవి అని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates