కిడ్నాప్ కథ సుఖాంతం: అమ్మ ఒడి చేరిన చిన్నారి

babyహైదరాబాద్‌లోని కోఠి ప్రసూతి ఆస్పత్రిలో కిడ్నాపైన పాప కథ సుఖాంతమైంది.  సోమవారం (జులై-2) పాపను గుర్తి తిలియని మహిళ ఎత్తుకెళ్లింది. పాప కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు  కేసును సవాలుగా తీసుకున్నారు. టీంలు గా ఏర్పడిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాపను ఎత్తుకెళ్లిన మహిళ …ఆ పసికందును కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో విడిచి వెళ్లింది. ఆస్పత్రి వర్గాల నుంచి సమాచారం అందుకున్న బీదర్ పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ కు గురైన పాప.. బీదర్ ఆస్పత్రిలో వదిలివెళ్లిన పాప ఒకరే అని పోల్చుకున్న పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటక టీంకు నేతృత్వం వహించిన ఏసీపీ చేతన వెంట సీఐలు, పాప అమ్మమ్మ, తండ్రి ఉన్నారు. మంగళవారం(జులై-3) అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో బీదర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆంబులెన్స్ లో బయలుదేరిన ఏసీపీ బృందం బుధవారం(జులై-4)ఉదయం 3.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ ఆసుపత్రికి చేరుకొని పాపను తల్లి అందించారు. ఈ కేసును చేధించడంలో సీసీటీవీ ఫుటేజ్ లు కీలకపాత్ర పోషించాయని.. బీదర్ పోలీసుల సహకారం, మీడియా సహకారంతో స్పీడ్ గా పాప ఆచూకీ తెలుసుకున్నామని తెలిపారు సుల్తాన్ బజార్ సీఐ. కిడ్నాపర్ మహిళను ఇంకా అదుపులోకి తీసుకోలేదని.. ఆమె కోసం మరో నాలుగు బృందాలు అక్కడే గాలిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates