కిమ్ తో ట్రంప్ మాటలు: అణురహితం చేయండి.. అభివృద్ధికి భరోసా ఇస్తా

trump-kimఅణు నిరాయుధీకరణే లక్ష్యంగా ఉత్తర కొరియా, అమెరికా అధినేతలు కిమ్‌ జాంగ్‌ ఉన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశం కానున్నారు. నార్త్ కొరియాకు ఇదో మంచి అవకాశమని… దేశాన్ని అణు రహితం చేస్తే అభివృద్ధికి సహకరిస్తామని కిమ్ కు భరోసా కూడా ఇచ్చారు.

సింగపూర్‌ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు సమావేశమవుతున్నారు. భారత కాలమానం ప్రకారం చూస్తే ఉదయం 6:30 గంటలకే భేటీ. సింగపూర్‌లోని సెంతోసా అనే దీవిలోని రిసార్టు శిఖరాగ్ర సదస్సు వేదిక కానుంది.

మీరు గనక ఈ ప్రాంతాన్ని సంపూర్ణంగా అణ్వస్త్ర రహితం చేస్తే మీ భద్రతకు మాదీ పూచీ.. ఇందుకోసం ప్రత్యేక భద్రతా విధానం రూపొందిస్తామని అమెరికా ఈ చర్చల్లో ప్రతిపాదిస్తోంది. అణ్వస్త్రాల నిర్వీర్యం సంపూర్ణంగా, ప్రపంచ దేశాలు పరీక్షించి సరిచూసుకొనేట్లు, సంతృప్తి పర్చేట్లు జరగాలని, అందుకు అంగీకరించాలని, అణ్వస్త్ర నిర్మూలనపై వెనకడుగు వేయరాదనేది  అమెరికా షరతు. ఇందుకు మాత్రమే సమ్మతిస్తామని, ఉత్తర కొరియా కూడా ఇందుకు సుముఖంగానే ఉందని భావిస్తున్నామని అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో అన్నారు. సెంతోసాలో ఇద్దరు అధినేతలూ సమావేశమయ్యే కేపెల్లా హోటల్‌కు సమీపంలోని వేరే హోటల్‌లో ఇరు దేశాల ఉన్నతాధికారులూ కీలక చర్చలు సాగిస్తున్నారు.

ఇవి సాగాల్సిన రీతిలోనే ఆశించిన లక్ష్య దిశగానే సాగుతున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఈ షరతుకు ఉత్తర కొరియా ఒప్పుకోవడమే కాక వాటి అమలు దిశగా నిర్దిష్ట చర్యలు మొదలెట్టేదాకా, తాము సంతృప్తి చెందే దాకా ఉత్తర కొరియాపై ఆంక్షలు కొనసాగుతాయని పాంపియో స్పష్టం చేశారు. అణ్వస్త్ర నిర్మూలన అనేది చర్చల్లో ఎజెండాలో ప్రధానాంశమని అటు ఉత్తర కొరియా కూడా ప్రకటించడం విశేషం. ‘‘అణ్వస్త్రాల తొలగింపు, ఈ ద్వీపకల్పంలో దీర్ఘకాల శాంతి స్థాపన, పరిరక్షణ దిశగా చర్యలు… మొదలైన వాటిని ట్రంప్‌తో కిమ్‌ చర్చిస్తారు’’ అని ఉత్తరకొరియా మీడియా కూడా తెలిపింది. అణ్వస్త్ర నిర్మూలనపై ఇన్నాళ్లూ ఉత్తర కొరియా, అమెరికా పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశాయి.


Posted in Uncategorized

Latest Updates