కిమ్ లెటర్ బాగుంది..ఇంకా చదవలేదు: ట్రంప్

trump kim letterఅమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పంపిన  లెటర్ ను అందుకున్నారు. ఆ లేఖ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు రెండు రోజుల క్రితం ట్రంప్‌ ట్విటర్ ద్వారా చెప్పారు. ఎట్టకేలకు ఆ లేఖ ఆయన చేతికి అందింది. అంతా బాగానే ఉంది కానీ.. ఆ లేఖలో ఏమి రాశార‌ని మీడియా ప్రతినిధులు అడిగినపుడు మాత్రం విచిత్రమైన సమాధానం చెప్పారు. దాన్ని ఇంకా తెరిచి చదవలేదని.. అయితే లేఖ చాలా బాగుందని ట్రంప్‌ చెప్పారు. అసలు లేఖ చదవకుండా.. అందులో ఏమి రాసుందో తెలియకుండా బాగుందని ఎలా చెప్పారా… అని వాళ్లు ఆశ్చర్యపోయారు.

ఈనెల 12న సింగపూర్‌లో ట్రంప్‌, కిమ్‌ మధ్య భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates