కియో సూపర్‌ లీగ్‌: స్మృతీ మందాన అరుదైన రికార్డు

ఇంగ్లండ్‌లో జరుగుతున్న కియో సూపర్‌ లీగ్‌లో ఆడుతున్న తొలి భారత ప్లేయర్ స్మృతీ మంధాన . ఈ లీగ్‌లో వెస్ట్రన్‌ స్ట్రోమ్‌ తరపున బరిలోకి దిగిన మంధాన.. మహిళల టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించి సరికొత్త బ్యాటింగ్‌ రికార్డు నమోదు చేసింది. ఆదివారం (జూలై-29) లాఫ్‌బారఫ్‌తో జరిగిన మ్యాచ్ లో మంధాన 18 బంతుల్లో ఆఫ్ సెంచరీ  చేసింది. దీంతో సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌)తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.వర్షం కారణంగా మ్యాచ్‌ను ఆరు ఓవర్లకు కుదించటంతో బ్యాటింగ్ చేసిన స్మృతి కదం తొక్కింది. 18 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో ఆఫ్ సెంచరీ సాధించింది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లాఫ్‌బారఫ్‌ ఆరు ఓవర్లలో 67 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

 

Posted in Uncategorized

Latest Updates