కిరాతక తండ్రి: స్కూల్ కి వెళ్తానన్నందుకు చంపేయబోయాడు

googleచిన్న పిల్లలపై దాడులు చేస్తున్న తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో రోజరోజుకి పెరిగిపోతున్నారు. మొన్న బెంగళూరులో, నిన్న జైపూర్ లో చిన్న పిల్లలపై దాడి చేసిన తల్లిదండ్రులను చూసి దేశం నివ్వెరపోయింది. కన్న తల్లిదండ్రులే ఇలా చేస్తే ఆ చిన్నారులు తమ భాధలు ఎవరితో చెప్పుకుంటారంటూ దేశ ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అయింది. సరిగ్గా అలాంటి ఘటన మరొకటి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో వెలుగు చూసింది. ఫ్రిబ్రవరి 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  చదువుకునేందుకు పాఠశాలకు వెళతానన్న 11 ఏళ్ల కూతుర్ని చెట్టుకు ఉరి వేసి చంపేందుకు యత్నించిన కసాయి తండ్రి బాగోతం బయటపడింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలీపుర్దౌర్ జిల్లా పంచకెల్ గురి గ్రామానికి చెందిన దిలీప్ ముందా అనే గిరిజన వ్యక్తికి. అపర్ణ, శ్యామలిక, కమలికలనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తన భార్య మరణించడంతో దిలీప్ ముందా మరో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి అయిన జాంబి పిల్లలతో ఇంటి పనిచేయిస్తూ భోజనం సరిగా పెట్టేది కాదు. దీంతోపాటు పాఠశాలకు చదువుకోవడానికి ఎందుకని ఇంట్లోని ఉండి పనిచేయమని చెప్పేది. ఈ సమయంలో కమలిక (11) తాను చదువుకునేందుకు పాఠశాలకు వెళతానని చెప్పడంతో ఆగ్రహించిన తండ్రి దిలీప్ చెట్టు వద్దకు తీసుకువెళ్లి ఆ చిన్నారిని ఉరివేసి చంపేందుకు ప్రయత్నించడంతో, ఇరుగుపొరుగువారు కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేసి విషయాన్ని శిశుసంక్షేమశాఖాధికారులకు తెలియజేశారు.

Posted in Uncategorized

Latest Updates