కిర్రాక్… కేజీఎఫ్ రెండో తెలుగు ట్రైలర్ చూశారా..?

ట్రైలర్ తోనే ఇండియా వైడ్ గా అందరినీ తనవైపుకు తిప్పుకుంది కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ) సినిమా. ఇపుడు ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ ను విడుదల చేశారు. మొదటి ట్రైలర్ కంటే భిన్నంగా ఉందీ ట్రైలర్. డైలాగులు వినిపించినవి మూడు, నాలుగే అయినా… సూపర్బ్ అనిపిస్తున్నాయి. “నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు.. కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం రాజులాగా, శ్రీమంతుడివై చనిపోవాలి” ,  “గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది”, “కొట్లాటలో ముందు ఎవడిమీద దెబ్బపడిందన్నది కాదు.. ముందు ఎవడు కింద పడిపోయాడన్నదే లెక్కలోకి వస్తుంది”, “గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్ స్టర్.. కానీ అతనొక్కడే వస్తాడు.. మాన్ స్టర్..” అనే డైలాగులు గుర్తుండిపోతాయి.

టేకింగ్, నిర్మాణ విలువలు, రీరికార్డింగ్ .. అన్నీ కూడా హైక్లాస్ గా ఉండటంతో…. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. యశ్ హీరోగా నటిస్తున్న ఈ కన్నడ సినిమాను హిందీ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో డబ్ చేస్తున్నారు. జపనీస్, చైనీస్ సహా పలు విదేశీ భాషల్లోనూ మూవీని రిలీజ్ చేయనున్నారు. హిందీ వెర్షన్ ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. తెలుగు ట్రైలర్ ను మీరూ ఓసారి చూడండి.

 

Posted in Uncategorized

Latest Updates