కిలో బంగారం సీజ్.. వెండి కోటింగ్ తో విమానంలో దేశాలు దాటించారు

స్మగ్లింగ్ కోసం నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. తనిఖీల్లో దొరక్కుండా బంగారాన్ని.. వెండి కోటింగ్ వేసి… విమానానికే ఎటాచ్ చేసి.. దేశాలు దాటించారు. పొడవాటి క్యూబాయిడ్ షేప్ లో ఉన్న గోల్డ్ బార్లను ఎవరూ గుర్తుపట్టకుండా.. మొత్తం సిల్వర్ రంగుతో కోటింగ్ అద్దారు. వీటిని విమానాలకే అంటించారు. అలా దేశాలు దాటిన రెండు బంగారం కడ్డీలను.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు.

ఇటలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో… హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు… శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుధవారం రోజున ఇద్దరు ప్యాసింజర్లను అదుపులోకి తీసుకున్నారు. స్పైస్ జెట్ విమానంలో ఆ ఇద్దరు స్మగ్లర్లు గౌహతి నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. వారిని తనికీ చేసిన అధికారులు.. గోల్డ్ స్మగ్లింగ్ కు సంబంధించి షాకింగ్ విషయాలు తెల్సుకున్నారు. బంగారానికి సిల్వర్ కోటింగ్ చేసి… విమానంలోనే దేశాలు దాటించారని అధికారులకు తెలిసింది. విమానంలో దాచి ఉంచిన కిలో బంగారాన్ని తీసుకోవడమే తమ పని అని… స్మగ్లర్లు విచారణలో అధికారులకు వివరించారు. దీని విలువ రూ.31 లక్షల 68వేల రూపాయలని అధికారులు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates