కిషన్ రెడ్డి వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన పాక్

KISHAN REDDYబీజేపీ ఎమ్మెల్యే  కిషన్‌రెడ్డి వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. సోమవారం (ఫిబ్రవరి-26) ఉదయం నుంచి తన వెబ్ సైట్ హ్యాక్ అయ్యిందంటూ ఇవాళ డీజీపీ మహెందర్‌రెడ్డిని కలిశారు. ఇది పాకిస్తానీల పనిగా అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన ఫిర్యాదు చేశారు.

ఆరు నెలల క్రితం కూడా తన వెబ్‌సైట్ KISHANREDDY.ORG సైట్ హాకింగ్‌కు గురైందని ఫిర్యాదులో తెలిపారు. సోమవారం ఉదయం ఓ వార్త పోస్టు చేసేందుకు తన ఉద్యోగి ప్రయత్నించగా..PAK MONSTERS పేరుతో మెసేజ్ కన్పనించిందని ఫిర్యాదులో తెలిపారు. హ్యాకింగ్‌పై దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Posted in Uncategorized

Latest Updates