కీరవాణి క్లాప్ : డియర్ కామ్రేడ్ ప్రారంభం

RASHMIKAమైత్రి మూవీస్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్న సినిమా ప్రారంభమైంది. సోమవారం (జూలై-2) హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభించింది యూనిట్. కొరటాల శివ, సుకుమార్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా రాగా, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరిపై షూట్ ప్రారంభించారు.

కొత్త డైరెక్టర్ భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు డియర్ కామ్రెడ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి, మహానటి సినిమాల విజయంతో మంచి జోరుమీదున్న ఈ యంగ్ హీరో ..వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ నటించిన టాక్సీవాలా త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది. డియర్ కామ్రేడ్ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపింది సినిమా యూనిట్. లాంచిగ్ సందర్భంగా ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు మేకర్స్.

Posted in Uncategorized

Latest Updates