కుండపోతగా పడుతోంది : ముంబైలో ఎక్కడ చూసినా నీళ్లే

rains-mumbaiమహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు బలపడడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై సహా చాలా జిల్లాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. 48 గంటలుగా వర్షం పడుతూనే ఉండడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గాలివానకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. MG రోడ్డులో చెట్టు కూలి ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. చాలా కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై వరద ప్రవాహం కొనసాగుతుండడంతో… వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో కనీసం ఇళ్ల నుంచి జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. నిత్యావసరాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మరోవైపు రానున్న 48 గంటల్లో ఒడిశా, బెంగాల్ గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తూర్పు ఉత్తరప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates