కుండపోతలు ఉండవంట : ఈసారి సాధారణ వర్షాలే

వచ్చే వర్షాకాలంలో ఉత్తర భారతమంతటా సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ అంచనా వేసింది. అయితే తమ అంచనాలో 5శాతం మోర్ ఆర్ లెస్ ఉండొచ్చని తెలిపింది. ఇక తెలంగాణ తప్ప దక్షిణ భారతంలోని నాలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని స్కైమెట్ తెలిపింది. తెలంగాణలో మాత్రం సాధారణ స్థాయి వర్షపాతం రికార్డ్ అవుతుందని స్కైమెట్ సంస్థ అంచనాలు ప్రకటించింది.

ఎల్ నినో ప్రభావం ఉండదని స్పష్టం చేసింది స్కైమెట్. దేశవ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో 55శాతం వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా సగటున 887 మిల్లీమిటర్ల వర్షపాతం పడనున్నట్లు తెలిపింది. కొన్ని చోట్ల 20శాతం అధికంగా వర్షం పడనున్నట్లు వెల్లడించింది. దక్షణాదిన మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే 96 నుంచి 104 శాతం (సాధారణ వర్షపాతం) పడనున్నట్లు అంచనా వేసింది ప్రముఖ వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్.

Posted in Uncategorized

Latest Updates