కుండపోత వానలు : మంగుళూరు మునిగిపోయింది

Mangaluru-in-coastal-Karnatakaవర్షం ఇలా కూడా పడుతుందా.. ఇంత భారీగా పడుతుందా.. ఆకాశానికి పెద్ద చిల్లు పడితే.. కుండను కుమ్మరిస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు కర్నాటక మంగుళూరు ప్రజలు. 24 గంటలుగా పడుతున్న వర్షంతో.. వీధులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై వాహనాలు మునిగిపోయాయి. ఇళ్లలోనే నడుంలోతు నీళ్లు వచ్చాయి. పార్కింగ్ ప్లేస్ లోని వాహనాలు కనిపించటం లేదు. అంటే అవి నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. మంగుళూరు లాల్ బాగ్ ఏరియాలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ సెల్లార్ పార్కింగ్ నీళ్లతో నిండి.. వాహనాలు కనిపించటం లేదు.

మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో ఇప్పటి వరకు 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. జూన్ 2వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలులు 50కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. మంగుళూరు–బెంగళూరు హైవే ధ్వంసం అయ్యింది. రహదారి మొత్తం నీట మునిగింది. ట్రాఫిక్ స్తంభించింది. ఇక ఉడిపి–కేరళను కలిపే ఫ్లైఓవర్ కూడా నీట మునిగింది. చాలా ఇళ్లల్లోకి నీళ్లు చేరుకున్నాయి. దీంతో స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. 24 గంటల్లో కోస్టల్ కర్నాటకలోని మంగుళూరు, ఉడిపిలో ఆగకుండా పడుతున్న వర్షంపై కేంద్రం స్పందించింది. NDRF బృందాలు రంగంలోకి దిగాయి.

Posted in Uncategorized

Latest Updates