కుక్కలు, నక్కలు వస్తాయా : విమానంలో దోమలపై ఆగ్రహం

goవిమానంలో దోమలున్నాయని ప్రశ్నించిన ఓ ప్రయాణికుడిని కిందకి దించేశారు. లక్నో నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది. సోమవారం(ఏప్రిల్-9) ఉదయం లక్నో నుంచి బెంగుళూరు వెళ్తున్న 6E-541 ఇండిగో విమానం ఎక్కాడు సౌరభ్ రాయ్ అనే ప్రయాణికుడు. విమానం బయలుదేరే సమయంలో దోమలు ఉన్నాయంటూ సిబ్బందికి కంఫ్లెయింట్ చేశాడు. అయితే విమాన సిబ్బంది అతడికి సమాధానం చెప్తున్న సమయంలో డోర్లు పగలగొట్టాలంటూ, విమానాన్ని ధ్వంసం చేయాలని ఇతర ప్యాసింజెర్లను రెచ్చగొట్టాడు.

హైజాక్ వంటి పదాలను ఉపయోగించాడు. దీంతో విమాన ఉద్యోగులు సౌరభ్ ని విమానం నుంచి దించేశారు. దోమలు ఉన్నాయని ప్రశ్నించినందుకు తనకు ఈ శిక్ష వేశారని సౌరభ్ ఆరోపించాడు. దీనిపై స్పందించిన ఇండిగో ఎయిర్ లైన్స్.. ప్రయాణికుల, సహోద్యోగుల సేఫ్టీ, భద్రతకే  ప్రాధాన్యమని ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. అంటే అంటారు గానీ విమానంలోకి దోమలు కాకపోతే కుక్కలు, నక్కలు వస్తాయా ఏంటీ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates