కుక్క అని పెంచుకుంటే..

nakkaవిశ్వాసానికి మారు పేరు కుక్క. కుక్కలను చాలా మంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. ఎంత ధరైనా పెట్టి మరీ కొనుక్కుని ప్రేమగా పెంచుకుంటారు. అవి కూడా వారితో అంత ప్రేమగానే కలిసిపోతాయి. అయితే చైనాకు చెందిన ఓ అమ్మాయి ఎంతో ప్రేమగా పెంచుకుందామని తీసుకొచ్చిన కుక్క కాస్త నక్క గా మారింది. దీంతో ఆ అమ్మాయి అవాక్కైంది. వాంగ్ అనే అమ్మాయికి కుక్కలంటే ఎంతోఇష్టం. దీంతో గతేడాది చాలా ఇష్టపడి ఓ షాపునుంచి చిన్న కుక్కపిల్లను కొనుకొక్కుని ఇంటికి తీసుకొచ్చింది. అల్లారు ముద్దుగా పెంచుకుంది. అయితే అది డాగ్స్ తినే ఫుడ్ ను తినడం మానేసింది.

అంతేకాదు దాని వెంట్రుకలు చాలా మందంగా, గుబురుగా పెరిగాయి. పార్కులకు తీసుకెళ్లినప్పుడు తోటివారంతా ఇది కుక్క కాదు నక్క అని చెప్పడంతో కంగారుపడ్డ వాంగ్‌ కుక్కల డాక్టర్‌ దగ్గరికి త‌న ప‌ప్పీని తీసుకెళ్లిందట. టెస్ట్ చేసిన డాక్టర్లు అసలు విషయం చెప్పారు. దీంతో ఈ నక్కను వాంగ్ జూకు అప్ప‌గించింది.

 

Posted in Uncategorized

Latest Updates