కుక్క పిల్ల అని పెంచుకొంటే…ఎలుక అయింది

కుక్కపిల్ల అని తీసుకెళ్లి పెంచుకొంటే కొన్ని రోజులకు అది ఎలుకగా మారిపోయింది. ఇది చూసిన ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. చైనాలో ఈ ఘటన జరిగింది.
చైనాలోని స్మాల్ మౌంటేన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి తన వీధిలో నల్లని చిన్న జీవి కనిపించింది. కుక్కపిల్ల అని దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. రోజూ దానికి ఫుడ్ పెట్టి పెంచుకొన్నాడు. అయితే ఎన్ని రోజులు అయినా ది కుక్క ఆకారానికి మారలేదు. దీంతో అనుమానం వచ్చి ఆ నల్లని జీవి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది ఓ రకమైన ఎలుక అని ఓ నెటిజన్ చెప్పడంతో అతను షాక్ అయ్యాడు. వాటిని బ్యాంబూ ర్యాట్ అని పిలుస్తారని, బ్యాంబూ చెట్లను ఆహారంగా తీసుకున్న కారణంగా వీటిని బ్యాంబూ ర్యాంట్స్ అని పిలుస్తారని వివరించాడు. ఇంతకుముందు కూడా కుక్క అనుకొని ఓ వ్యక్తి ఎలుగుబంటిని పెంచుకొన్నాడు.

Posted in Uncategorized

Latest Updates