కుటుంబంతో కలసి తాజ్ మహల్ ను సందర్శించిన కెనడా ప్రధాని

truduవారం రోజుల భారత పర్యటనలో భాగంగా ఈ రోజు(ఫిబ్రవరి18) ఉదయం కుటుంబ సభ్యులతో కలసి తాజ్ మహల్ ను సందర్శించారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ. తన భార్య సోపి గ్రిగోరి ట్రూడూ, కొడుకు హెడ్రిన్, కూతుర్లు సేవియర్, ఎల్లాగ్రేస్ లతో కలసి తాజ్ మహల్ పరిసర ప్రాంతాలన్నీ కలియతిరుగుతూ తాజ్ మహల్ అందాలను ఆస్వాదించారు ట్రూడూ, అతని కుటుంబ సభ్యులు. తన తాజ్ మహల్ సందర్శన గుర్తుగా ట్రూడూ విజిటర్స్ బుక్ లో ఓ మెసేజ్ ను రాసారు. ప్రపంచంలోని అతి సుందరమైన కట్టడాలలో తాజ్ మహల్ ముఖ్యమైనదని, అటువంటి అద్భుతమైన తాజ్ మహల్ ను సందర్శించడం ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు అంటూ తాజ్ మహల్ అందాలకు ఫిదా అయిన ట్రూడూ తన మెసేజ్ లో తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates