కుటుంబం అంటే ఇదేనా : పోలీస్ భర్తను చంపిన భార్య, కూతురు

wife-husbendవారిది పెద్ద కుటుంబం.. చింతలు లేని కుటుంబం అని అందరూ అనుకున్నారు. ఓ భర్త, భార్య వారికి నలుగురు కూతుళ్లు. భర్త పేరు మెహర్బాన్ అలీ. పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్. జీతం కూడా బాగా వస్తుంది. భార్య, కూతుళ్లను సంప్రదాయబద్దంగా ఉంచాలని కోరుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇంట్లో కఠినంగా ఉండేవాడు. చదువు, ఇల్లు మాత్రం ఉండాలని కోరుకున్నారు. బయటకు తిరగటంపై ఆంక్షలు పెట్టాడు. అయినా ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. అయినా అతనిపై ప్రేమ, దయ లేవు వారికి. భర్త అయినా సరే చంపేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా భార్యతోపాటు జహీదా అనే కూతురు కలిసి ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్ ను మాట్లాడుకున్నారు. భర్తతోపాటు ఆ కూతురికి తండ్రి అయినా సబ్ ఇన్ స్పెక్టర్ మెహర్బాన్ అలీని చంపేయాలని నిర్ణయించారు.
అనుకున్నదే తడవుగా ఇద్దరు కాంటాక్ట్ కిల్లర్స్ కు డబ్బులు ఇచ్చారు. జూన్ 24వ తేదీ ఆదివారం డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చారు అలీ. ఎప్పట్లాగా తండ్రితో వ్యవహరించిన ఆ కుటుంబ సభ్యులు.. ఆ రోజు అర్థరాత్రి తమ పథకం అమలు చేశారు. ఇంట్లోనే ఉన్న తండ్రి ఆచూకీని కిల్లర్స్ కు సమాచారం ఇచ్చింది కూతురు జహీదా. వారి వచ్చిన గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ కూడా బైక్ పై అలీ డెడ్ బాడీని వారి ఇంటికి 250మీటర్ల దూరంలోనే డ్రైనేజ్ లో పడేశారు. అలీ పోలీస్ బైక్ ను కూడా దగ్గర్లోనే పడేశారు. అర్థరాత్రి ఇంటికి వస్తూ ప్రమాద వశాత్తూ డ్రైనేజ్ లో పడి చనిపోయాడని నమ్మించటానికి ప్రయత్నించారు. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత అనుమానం వచ్చింది పోలీసులకు. కుటుంబ సభ్యులపై నిఘా పెట్టగా అడ్డంగా దొరికిపోయారు. భర్తను, తండ్రిని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు పోలీసులు. తండ్రి చనిపోతే ఆ ఉద్యోగం నాకు వస్తుందన్న ఆశతో కూతురు, ఇంట్లో ఆంక్షలు పెట్టటంతో భరించలేక భార్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చనిపోతే ఉద్యోగంతోపాటు పెన్షన్ కూడా వస్తుందని.. మరింత డబ్బుతో బాగా బతకొచ్చనే ఆలోచనతోనే ఈ విధంగా చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజన్ పూర్ నగరంలో జరిగింది.

Posted in Uncategorized

Latest Updates