కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ : కర్నె ప్రభాకర్

టీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. తెలంగాణకు నీళ్లు వస్తుంటే కాంగ్రెస్ అడ్డుపడుతుందన్నారు. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులను ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేస్తుంటే కళ్లుండి కూడా చూడలేని కబోధిలా వ్యవహరిస్తుంది  కాంగ్రెస్ అని ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రంలో కాళేశ్వరం, పాలమూరు, సీతారామ, డిండి ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగుతుంటే తెలుగుదేశంతో కలసి కాంగ్రెస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందన్నారు కర్నె ప్రభాకర్.

 

Posted in Uncategorized

Latest Updates