కుప్పకూలిన ఇళ్లు : ఆరుగురు మృతి

ఇళ్లు కుప్పకూలడంతో ఫ్యామిలీమొత్తం మృతి చెందిన ఘటన యూపీలో జరిగింది.  శనివారం (జూలై-28) సహారాపూర్‌ లో  ఉదయం ఓ ఇళ్లు కుప్పకూలడంతో ఇంట్లో నివాసం ఉంటున్న ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఇళ్లు కూలినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.

Posted in Uncategorized

Latest Updates