కుప్పకూలిన మూడంతస్తుల హోటల్..10 మంది మృతి

buildingమధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర ప్రమాదం జరిగింది. సర్వతే బస్టండ్ సమీపంలో మూడంతస్తుల హోటల్ బిల్డింగ్ కుప్పకూలి 10 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు.  భవన శిథిలాల కింద మరో20 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. హోటల్ భవనాన్ని కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.

బిజీ ప్రాంతం కావడంతో ఆ ప్రాంతమంతా జనంతో కిటకిటలాడుతోంది. భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో జనం పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళం అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates