కుప్పకూలిన విమానం : 181 మంది సైనికులు మృతి

algeriaఅల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 200 మంది మిలిటరీ  సిబ్బందితో వెళ్తున్న మిలిటరీ విమానం బౌఫారిక్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో  181 మంది సిబ్బంది మృతి చెందారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే 14 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.  సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న అన్ని రోడ్లను మూసేశారు. బౌఫారిక్ మిలిటరీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాజధాని అల్జీర్స్‌కు దగ్గర్లో విమానం కూలింది. అల్జీరియా ఎయిర్‌ఫోర్స్ ఆధీనంలో ఈ ఎయిర్‌పోర్ట్ ఉంది.

Posted in Uncategorized

Latest Updates