కుమారస్వామికి కేసీఆర్ అభినందనలు

KCకర్ణాటక సీఎంగా బుధవారం(మే-23) ప్రమాణస్వీకారం చేయనున్నకుమారస్వామికి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ రోజు బెంగళూరులోని కుమారస్వామి నివాసానికి వెళ్లిన కేసీఆర్… రేపు తనకి హైదరాబాద్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండటంతో కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాలేకపోతున్నానని, అందుకనే.. ఈరోజు తాను బెంగళూరు వచ్చి కుమారస్వామికి అభినందనలు తెలపడం జరిగిందన్నారు. మరొకసారి తప్పకుండా బెంగళూరు వచ్చి కుమారస్వామిని కలుస్తానన్నారు. దేవుడు కుమారస్వామిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ ఆశీర్వాదంతో కుమారస్వామి ముందుకువెళ్తారన్నారు. ప్రాంతీయ పార్టీలే భవిష్యత్తులో రాజకీయాలను నిర్ధేశిస్తాయన్నారు. కర్ణాటక ప్రజలకు గుడ్ లక్ చెప్పారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates