కుమ్మరులకు చేతినిండా పని : మట్టి వినాయకులకు ప్రభుత్వం కృషి

CHAVITHI MATTIపర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితికి ఇప్పట్నుంచే మట్టి గణపతుల తయారీకి కృషి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కుమ్మరి, శాలివాహన కులస్తులకు చేయూతనిచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు పర్యావరణానికి హాని కలగకుండా కుమ్మరులతో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయిస్తూ.. వారికి ఉపాధి కల్పించడానికి ప్రణాళిక రూపొందించింది బీసీ కార్పొరేషన్‌. విగ్రహాల తయారీ, విక్రయాల బాధ్యతలను శాలివాహన ఫెడరేషన్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వినాయక చవితి పండగ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల విగ్రహాలను తయారు చేసి విక్రయించేలా టార్గెట్ పెట్టుకుది బీసీ కార్పొరేషన్. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఐదుగురు కుమ్మరి కళాకారులను ఎంపిక చేసింది. వీరికి వచ్చే వారంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గుజరాత్‌ మాటీకామ్‌ సంస్థకు చెందిన నిపుణులతో 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ తర్వాత మాస్టర్‌ ట్రైయినర్లు జిల్లా కేంద్రాల్లో మరింత మంది కళాకారులకు శిక్షణ ఇస్తారు. మాస్టర్‌ ట్రైయినర్లు వ్యక్తిగతంగా వినాయక తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు రూ.25వేల రాయితీని ప్రభుత్వం అందించనుంది. తయారైన ఈ విగ్రహాలను బీసీ కార్పొరేషన్‌-శాలివాహన ఫెడరేషన్‌ ఔట్‌లెట్ల ద్వారా విక్రయించనున్నారు. GHMC పరిధిలో 5 లక్షల మట్టి విగ్రహాలు తయారు చేసి.. తక్కువ ధరకు భక్తులకు అందించనున్నారు. ఈ మేరకు GHMCతో బీసీ కార్పొరేషన్‌ ఒప్పందం చేసుకోవాల్సి ఉందని తెలిపారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates