కుమ్మేశాడు : 100 కోట్ల క్లబ్ లో చేరిన రంగస్థలం

rgvవిడుదలైన మొదటి రోజు నుంచే రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది రంగస్థలం. ఇప్పటికే మంచి వసూళ్లను సాధిస్తున్న రంగస్థలం ముందు ముందు మరిన్ని రికార్డ్ లు తిరగరాయటం ఖాయం అంటున్నారు అభిమానులు. రామ్ చరణ్, సమంత హీరో, హీరోయిన్లుగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగస్థలం ప్ర‌పంచ వ్యాప్తంగా 100 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా ఓవ‌ర్సీస్‌లోనూ ఈ సినిమాకు అశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో రెండు మిలియ‌న్ డాల‌ర్ల వసూళ్లు సాధించింది. ఆస్ట్రేలియాలో కూడా రంగ‌స్థ‌లం హ‌వా కొన‌సాగుతుంది. ఈ ఏడాది విడుద‌లైన భార‌తీయ సినిమాలలో ప‌ద్మావ‌త్ త‌ర్వాత ఆస్ట్రేలియాలో ఎక్కువ వ‌సూళ్ళు రాబ‌ట్టిన చిత్రం రంగ‌స్థ‌లం అని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. 1980ల కాలంలో జరిగే కథగా తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్‌.. చిట్టిబాబు గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. చరణ్ కెరీర్ లోనే రంగస్థలం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Posted in Uncategorized

Latest Updates