కులమతాలు కాదు..మనుషులే ముఖ్యం : పవన్

డల్లాస్ : తానెప్పుడూ కులాలు, మతాలను నమ్మలేదని మనుషుల్ని మాత్రమే నమ్మానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అన్ని పార్టీల కులాలకు సంబంధించిన వింగ్స్ ఉంటాయని జనసేన పార్టీలో మాత్రం డాక్టర్స్ వింగ్స్ ఏర్పాటు చేస్తానన్నారు. అమెరికాలోని డల్లాస్ లో NRI డాక్టర్లతో సమావేశమయ్యారు పవన్. ప్రభుత్వాల నుంచి డాక్టర్లకు సరైన సపోట్ దొరకట్లేదన్నారు. ప్రజలకు సేవ చేయడమే గొప్ప అడిక్షన్ అన్న పవన్……దానికి అలవాటైతే ఆ తృప్తి వేరన్నారు. 25 ఏళ్ల రాజకీయ, సామాజిక మార్పు కోసం తన జీవితాన్ని పణంగా పెడుతున్నాని చెప్పారు. తన చివరి శ్వాస ఆగేలోపు అనుకున్న మార్పును కచ్చితంగా సాధిస్తానన్నారు పవన్

 

Posted in Uncategorized

Latest Updates