కులూమనాలిలో వరదలు.. ప్రమాదంలో హీరో కార్తీ సినిమా టీమ్

కులూమనాలి: వరదల కారణంగా.. తమిళ నటుడు కార్తీ నటిస్తున్న లేటెస్ట్ సినిమా షూటింగ్ లో నిర్మాతకు భారీ నష్టం కలిగింది. కార్తీ కొత్త సినిమా దేవ్ షూటింగ్… హిమాచల్ ప్రదేశ్ లోని కులూమనాలిలో జరుగుతోంది. మంచు, వర్షంలో ఓ సీన్ తీస్తున్నారు. ఇందుకు సంబంధించి సెట్టింగ్స్ అన్నీ పూర్తయ్యయి. వర్షం కూడా పడుతుండటంతో… సీన్ కు కూడా బాగా కుదిరింది. కొండపై ఓ నది పక్కన షూటింగ్ చేస్తున్నారు. అనుకోని ప్రమాదంలాగా ఉన్నట్టుండి నదిలో వరద ప్రవాహం పెరిగిపోయి.. ప్రమాదకర స్థాయిని దాటింది. షూటింగ్ కోసం చేసుకున్న సెటప్ అంతా వరదలో కొట్టుకుపోయింది. వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.

వరదల కారణంగా షూటింగ్ రద్దైపోయింది. సినిమా టీమ్ లోని హీరో కార్తి సహా.. ప్రముఖులు సురక్షిత ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నారు. చిత్రబృందంలోని 140 మంది వరదలతో ఇబ్బందుల్లో ఉన్నారు. షూటింగ్‌ రద్దు కారణంగా ప్రిన్స్ పిక్చర్స్ అధినేత, సినిమా నిర్మాత లక్ష్మణ్‌కు రూ.కోటిన్నర నష్టం జరిగింది.

“వర్షాలు, వరదలపై ముందస్తు సమాచారం ఇవ్వలేదు. వరద ఒక్కసారిగా పెరిగి.. బండరాళ్లు కొట్టుకొచ్చాయి. వరద డేంజర్ గా మారింది. ఐదు గంటల పాటు కారులోనే కూర్చోవాల్సి వచ్చింది. నదికి దూరంగా… కొండ కింద ఉన్న ఓ గ్రామంలోకి వచ్చాం. కొండమీదే 140మంది టెక్నీషియన్లు ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా ఉన్నారు. బాధగా అనిపిస్తోంది” అని హీరో కార్తీ సోషల్ మీడియాలో స్పందించారు.

Posted in Uncategorized

Latest Updates