కుల్దీప్ మాయాజాలం.. ఇంగ్లాండ్ దూకుడుకు బ్రేక్

లార్డ్స్ వేదికగా శనివారం(జూలై-14) భారత్ తో జరుగుతున్న సెకండ్ వన్డేలో మళ్లీ మాయచేశాడు కుల్దీప్ యాదవ్. దూకుడుమీదున్న ఇంగ్లాండ్ కు బ్రేక్ వేశాడు. తన ఖాతోలో మొదటి రెండు వికెట్లను వేసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌ మెన్లను కుల్దీప్ యాద‌వ్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఫస్ట్ వన్డేలో తన తొలి ఓవర్‌ లోనే తొలి వికెట్ తీసిన కుల్దీప్ యాదవ్.. రెండో వన్డేలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాడు.

11వ ఓవర్ వేయాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ యాదవ్‌ కు బంతనివ్వగా.. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(38)ను ఔట్ చేసి, వికెట్ల ఖాతా తెరిచాడు. రెండో బంతిని గూగ్లీ వేయగా బెయిర్‌ స్టో స్వీప్‌ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి కాస్త అతని బ్యాట్‌ కు తాకకుండా ప్యాడ్‌ కు తాకి మళ్లీ తన గ్లోవ్‌ కు తాకి నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. దీంతో బెయిర్‌స్టో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

ఫస్ట్ 10 ఓవర్లలో రన్‌ రేట్ 7 తగ్గకుండా ఓపెనర్లిద్దరూ రన్స్ సాధించారు. పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుండి నడిపించారు. తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరో ఓపెనర్ జేసన్ రాయ్(40)  స్వల్ప వ్యవధిలోనే మైదానాన్ని వీడాడు. కుల్దీప్ వేసిన 14వ ఓవర్ మొదటి బంతిని భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద ఉమేశ్ యాదవ్ క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. సిరీస్‌ లో కుల్దీప్‌ కు ఇది 8వ వికెట్ కావడం విశేషం. ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. జో రూట్(24), మోర్గాన్ (18) క్రీజులో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates