కువైట్ బాధితులకు కేటీఆర్ సాయం

KTR HELPతెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. వివిధ కారణాలతో కువైట్ లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులను వారి స్వస్థలాలకు రప్పించేందుకు కృషి చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు వారికి ఉచిత విమాన టికెట్లతో పాటు ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటి వరకు ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బీ.రాజు, అనిల్, కొన్ని సంవత్సరం క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. వివిధ కారణాలతో వారిని అక్రమ నివాసితులుగా ఆ దేశాధికారులు గుర్తించారు. ఇటీవల కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షతో వీరు స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి లభించింది. అయితే విమాన టికెట్లు పొందడానికి సమస్యలు ఎదురవడంతో కువైట్ లోని భారత రాయబార కార్యాలయంతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది.

Posted in Uncategorized

Latest Updates