కువైట్ లో ఆత్మహత్య :కంపెనీలు జీతాలివ్వడంలేదు.. అమ్మకు డబ్బులు పంపలేకపోతున్నా

gulfఎన్నో ఆశలతో, ఆశయాలతో కువైట్ వెళ్లిన ఓ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. తల్లికిచ్చిన మాట కోసం రేయింబవళ్లు కష్టపడ్డా ఫలితం లేదని, తల్లికిచ్చిన మాట తప్పానని ఓ యువకుడు ఆత్యహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా పెంబట్లకు చెందిన తోట నాగరాజు(25) డబ్బులు బాగా సంపాదించి తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఓ ఏజెంట్ ద్వారా2016లో కువైట్ వెళ్లాడు. రెండు, మూడు కంపెనీల్లో పని చేశాడు. జీతం సరిగా ఇవ్వలేదని అక్కడ ఉద్యోగం మానేశాడు. రెండు నెలల క్రితం “యూరోపియన్ కార్ సర్వీసెస్” కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. బాగా డబ్బులు వస్తాయ్, ఇంటికి డబ్బులు పంపవచ్చు అనుకున్నాడు. కానీ మొదటి నెల జీతం ఇస్తామన్న దానికన్నా తక్కువ ఇవ్వడంతో మనస్ధాపం చెందాడు నాగరాజు. అయితే రెండో నెల కూడా జీతం అంతకన్నా తక్కువ వడంతో తీవ్రంగా మనస్ధాపం చెందిన నాగరాజు తన స్నేహితుడు రాజశేఖర్ కు వాయిస్ మెయిల్ చేసి తను పని చేసే దగ్గరే బుధవారం(ఫిబ్రవరి7) రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు చనిపోయాడని తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, నాగరాజు భౌతికకాయాన్ని ఇక్కడికి రప్పించడానికి సాయం చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు.

Posted in Uncategorized

Latest Updates