కూకట్ పల్లిలో విషాదం: నీట మునిగిన కారు..ఒకరి మృతి

CARకూకట్ పల్లిలో వర్షపు నీరు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. జయానగర్ లోని శ్రీ మయూరి రెసిడెన్సీ సెల్లార్ లో వర్షం నీరు నిండి గోపి అనే వ్యక్తి మృతి చెందాడు. ఓనర్ ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి.. సెల్లార్ లో కారు పార్క్ చేసి.. కారులోనే నిద్రపోయాడు గోపి. రాత్రి కురిసిన వర్షానికి కారు నీట మునిగింది. దాంతో గోపి కారులోనే చనిపోయాడు. తెల్లవారుజామున 3 గంటలకు మోటార్ల ద్వారా నీటిని తోడేసి మృతదేహాన్ని బయటకు తీశారు అగ్నిమాపక సిబ్బంది. బాడీని గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

Posted in Uncategorized

Latest Updates