కూకట్ పల్లి న్యూ సెంచరీ స్కూల్ సీజ్


హైదరాబాద్ కూకట్ పల్లిలోని న్యూ సెంచరీ స్కూల్ ను సీజ్ చేశారు అధికారులు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. వందల సంఖ్యలో పేరంట్స్ తరలివచ్చారు. స్కూల్ లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఓ వైపు ఇద్దరు పిల్లలు చనిపోవటం, మరో నలుగురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్కూల్ లోని పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించారు మేడ్చల్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. చనిపోయిన ఇద్దరు విద్యార్థినుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామన్నారు. స్కూల్ యాజమాన్యం అందుబాటులో లేదని చెప్పారు. పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

స్కూల్ సీజ్ అయిందని..  విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అవసరమైతే వేరే స్కూల్ లో అడ్మిషన్ ఇప్పించేలా ప్రయత్నిస్తామని చెప్పారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Posted in Uncategorized

Latest Updates