కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం కావొచ్చు: కేటీఆర్

టీఆర్ఎస్ వంద సీట్లు సాధించడం ఖాయం అన్నారు రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన… ఎన్నికల వ్యూహాలు, సర్వేలు, అంచనాలపై స్పందించారు. “55 నియోజక వర్గాల్లో పర్యటించాను. జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశంలోనే రాహుల్ గాంధీ పెద్ద జోకర్. నవంబర్ 20 తర్వాత లగడపాటి సర్వే చేయలేదు. మైండ్ గేమ్ ఆడాలని చూస్తున్నారు. కొన్ని టివి ఛానల్ లు, పేపర్లు కూడా కూటమికి అటాచ్ అయ్యాయి. మా స్నేహితులు ఎవరు.. శత్రువులు ఎవరో..?  ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది.. మహా కూటమిని నడిపించే రెండు మీడియా సంస్థల వివరాలు.. డిసెంబర్ 11 తర్వాత చెబుతా” అన్నారు కేటీఆర్.

“కేంద్రంలో మా ఫ్రంట్ వుంటుంది.. కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా వుంది. కొడంగల్, మధిరలో మేమే గెలుస్తున్నాం. హుజూర్ నగర్ లో కూడా మేము గట్టి పోటీ ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ ముఖ్య నేతల్లంతా వారి నియోజక వర్గాలు దాటి బయటికి రాలేకపోయారు. ఉత్తమ్ తన భార్య నియోజక వర్గంలో కూడా రాహుల్ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. డీకే అరుణ కూడా రాహుల్ మీటింగ్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు.. గజ్వేల్ తో సహా అన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొడంగల్ లో ప్రచారం చెయ్యొద్దా.. ? మేము ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాం. రేవంత్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య కూడా పార్టీ మారారు. మరి పార్టీ మారిన వాళ్ళను ఓడించాలని చంద్రబాబు అంటే ఎలా? ఏపీలో కూడా 23 మంది వైసీపీ వాళ్ళను టీడీపీలో చేర్చుకున్నారు. రూల్స్ అందరికి ఒకటే వుంటాయి కదా.. పార్టీ పార్టీ కి మారవు కదా” అన్నారు.

కూటమి అధికారం లోకి వస్తే.. చంద్రబాబు సీఎం అవుతారేమో..? అని అన్నారు కేటీఆర్. ఏపీని లోకేష్ కు వదిలేసి.. చంద్రబాబు ఇక్కడికి రావొచ్చు. తెలంగాణ కాంగ్రెస్ ను చంద్రబాబు కొన్నాడు కదా. కాంగ్రెస్ మానిఫెస్టోలో చాలా అంశాలకు పొంతన లేదు. మేనిఫెస్టో లో ఒకటి పెట్టారు. బయటికి ఒకటి చెబుతున్నారు. రాహుల్ వచ్చాడు వెళ్ళాడు. మళ్లీ కనిపిస్తాడా. సంక్షేమానికి మా ప్రభుత్వం స్వర్ణ యుగం. సాగు నీటి, తాగు నీటి, విద్యుత్ రంగంలో విజయం సాధించాం. సర్వేల పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. నవంబర్ 20 తర్వాత లగడపాటి అసలు సర్వేనే చేయలేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 150 నుంచి 170  దాటవు. కాంగ్రెస్ కు వంద లోపే వస్తాయి. 11 తర్వాత ఫెడరల్ ఫ్రంట్ వైపు వేగంగా అడుగులు వేస్తాం. చంద్రబాబు ప్రచారంతో మాకు లాభమే జరిగింది. హైదరాబాద్ లో 17 సీట్లు గెలుస్తున్నాం. కాంగ్రెస్ పెద్ద నాయకుల్లో లబ్ డబ్ మొదలయింది” అన్నారు కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates