కూతురికి జ్వరం వచ్చినా సెలవు ఇవ్వలేదు..అందుకే కాల్చి చంపాడట

న్యూఢిల్లీ: గురు గ్రామ్‌లో అడిషనల్ సెషన్స్ జడ్జి క్రిష్ణకాంత్ భార్య, కొడుకును ఓ కానిస్టేబుల్ కాల్చిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతురిని చూసి రావడానికి జడ్జి సెలవు ఇవ్వకపోవడం వల్లే మహిపాల్ సింగ్ అనే ఆ కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. జడ్జి సెలవు ఇవ్వకపోగా.. షాపింగ్‌ కు వెళ్తున్న తన భార్య, కొడుకుకు ఎస్కార్ట్‌ గా వెళ్లాలని ఆదేశించడంతో.. అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

గురుగ్రామ్ మార్కెట్‌ లో పట్టపగలే ఆ ఇద్దరిపై మహిపాల్ సింగ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో జడ్జి భార్య అక్కడికక్కడే చనిపోగా.. కుమారుడు మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని బ్రెయిన్ డెడ్‌ గా డాక్టర్లు ప్రకటించారు. హర్యానా పోలీసులు తమను వేధిస్తున్నారని కూడా మహిపాల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన కూతురు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు మెడికల్ రిపోర్ట్ చూపించినా వినలేదని వాళ్లు చెప్పారు. అతడో కానిస్టేబుల్, సెక్యూరిటీ గార్డ్. అంతే తప్ప ఇంటి పని మనిషి కాదు. అతని కుటుంబ సభ్యులను షాపింగ్‌ కు తీసుకెళ్లడం అతనికి నచ్చలేదు అని మహిపాల్ సింగ్ స్నేహితులు వెల్లడించారు. ఆ ఘటన జరిగిన రోజు కూడా అతడు కేవలం మూడు గంటలే పడుకున్నాడని, బలహీనంగా ఉన్నాడని చెప్పారు.

 

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates