కూరగాయల ధరలపై ఎఫెక్ట్ : 70 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ ఆల్ టైం హై

petrol-vegetablesపెట్రోల్, డీజిల్.. భారతదేశంలో ఇప్పుడు సరికొత్త ధర వచ్చింది. హైదరాబాద్ లోనే లీటర్ పెట్రోల్ రూ.83.08కి చేరుకుంది. అదే విధంగా డీజిల్ రూ.75.35కి చేరుకుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ధర ఉండటం ఇదే ఫస్ట్ టైం. ధర పెరిగినందుకు కాదు.. దాని ప్రభావం నిత్యావసర ధరలపై పడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లో ఆల్ టైం హైకి ఇంధన ధరలు టచ్ అయ్యాయి. డీజిల్ రేటు అయితే దేశంలోనే ఎక్కువగా హైదరాబాద్ లో ఉంది. పెట్రోల్, డీజిల్ మధ్య వ్యత్యాసం కేవలం రూ.8 మాత్రమే. పెట్రోల్ ధరతో పోటీ పడుతున్న డీజిల్ ధర.. వాహనదారులకు బెంబేలెత్తిస్తోంది. ట్రాఫిక్ లో కారు తీయాలంటే వణికిపోతున్నారు.

ధరలు ఇలా ఉంటే.. ఈ ఎఫెక్ట్ నిత్యావసర ధరలపై పడుతుంది. కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి. రైతు బజార్లలో కొంత తక్కువగా ఉన్నా.. బహిరంగ మార్కెట్ లో మాత్రం ఇంధన ధరల పెంపు ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. 15 రోజుల క్రితం ఉన్న ధరలతోపోల్చితే.. ఇప్పుడు 5 నుంచి 10 రూపాయల ధరలు పెరిగాయని చెబుతున్నారు వినియోగదారులు. నాలుగు రోజుల క్రితం వరకు రూ.15 ఉన్న ఆలుగడ్డ.. ఇవాళ రూ.25కి చేరింది. అదే విధంగా బెండ రూ.32, టమోటా రూ.20, పచ్చిమిర్చి రూ.50, దొండ రూ.20, బీట్ రూట్ రూ.17, వంకాయ రూ.20, క్యారెట్ రూ.25, క్యాలిఫ్లవర్ రూ.50, బీరకాయ రూ.50, ఫ్రెండ్ బీన్స్ రూ.90గా ఉన్నాయి. 15 రోజుల క్రితం వరకు 10 రూపాయలు తక్కువగానే ఉన్నాయి. అయితే డీజిల్, పెట్రోల్ రేట్లు భారీగా పెరగటంతో.. రైతులు, వ్యాపారులు కూడా ధరలను పెంచారు.

 

………………………………………………………………………..

 

 

వచ్చేశాను.. ఇక కుమ్మరిస్తాను : కేరళను తాకిన నైరుతి

భారతదేశానికి చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అధికారికంగా ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఉదయం 11.30 గంటలకు విడుదల చేసిన వెదర్ బులిటెన్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ 1వ తేదీకి నైరుతి ప్రవేశించొచ్చు అని గతంలో వాతావరణ శాఖ ప్రకటించింది. అయతే అనుకున్న టైం కంటే మూడు రోజుల ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి రుతుపవనాలు.

అరేబియా సముద్రం నుంచి కొమరిన్ ప్రాంతం మొత్తం ఈ రుతుపవనాలు విస్తరించాయి. దేశంలోకి నైరుతి రుతుపవనాలు రాకను ఈ విధంగా గుర్తించింది వాతావరణ శాఖ. కేరళలోని మినికోయ్, అమిని, తిరువనంతపురం, పునలూర్, కొల్లాం, అల్లపుజ, కొట్టాయం, కొచి, త్రిశూర్, కోచికోడ్, కాన్నూర్, తలశెరి, కుడులు, మంగళూర్ ప్రాంతాల్లో 48 గంటల్లో 2.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఈ 14 ప్రాంతాల్లో పడిన వర్షపాతం ఆధారంగా భారతదేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించినట్లు చెబుతున్నారు.

రుతుపవనాలు విస్తరణ ఈసారి చురుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జూన్ 7, 8 తేదీల్లో తెలంగాణలోకి ప్రవేశించొచ్చు. ఇప్పటికే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉండటంతో.. అనుకున్న సమయం కంటే.. ఒకటి, రెండు రోజుల ముందుగానే రావొచ్చని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం రుతుపవనాల విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉందని కూడా చెబుతున్నారు అధికారులు. ఈసారి మంచి వర్షాలు పడతాయంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates