కూలిన MIG-21 : పైలట్ మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) కి చెందిన MIG-21 యుద్ధ విమానం కుప్పకూలింది. బుధవారం (జూలై-18) పంజాబ్‌ లోని పఠాన్‌ కోట్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన  విమానం హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా జిల్లాలోని మెహ్రా పల్లి గ్రామంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్ చనిపోయాడు.  సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్, అధికారులు  సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విమానం కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు నిపుణులు.

Posted in Uncategorized

Latest Updates