కూలిన సుఖోయ్ : సురక్షితంగా బయట పడ్డ పైలట్లు

Sukhoinashikమహారాష్ట్ర  నాసిక్ సమీపంలో ఇవాళ సుఖోయ్ యుద్ధ విమానం కూలింది.  ఎస్‌యూ-30ఎంకేఐ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయట పడ్డారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) సంస్థలో ఇప్పుడిప్పుడే సుఖోయ్ విమానాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రమాదానికి ముందే పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు డిఫెన్స్ పీఆర్‌వో. అయితే ఏ కారణం చేత సుఖోయ్ కూలిందన్న విషయం ఇంకా తెలియలేదు. ప్యారాచూట్ల ఆధారంగా పైలట్లు బయటపడినట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates