కూలుతున్న క్లాస్ రూంలు : చెట్ల కిందే పాఠాలు

వెలుగు నెట్ వర్క్: సుభాష్‍ నగర్‍ డివిజన్లోని ఓ గవర్నమెంట్‍ స్కూల్లో కనీస వసతులు లేక స్టూడెంట్స్ అవస్థలు పడుతున్నారు. పెచ్చులూడుతున్న క్లాస్ రూమ్స్  తో స్కూల్ బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది. కుత్బుల్లా పూర్ నియోజవర్గం సుభాష్‍ నగర్ డివిజన్ సూరారం కాలనీలోని ఉన్న ఈ గవర్నమెంట్‍ స్కూల్లో మొత్తం 1,210 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరందరికి సరిపడా క్లాస్ రూమ్స్ లేవు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని టీచర్లు చెప్పారు.

హై స్కూల్లో..
హై స్కూల్ లో 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 890 మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రతి క్లాస్ రూమ్ కి 3 సెక్షన్ల చొప్పున స్టూడెంట్స్ ని 15 సెక్షన్లుగా డివైడ్‍ చేసి టీచింగ్ చేస్తున్నారు. తెలుగు మీడియం లో ఒకటి, ఇంగ్లీష్​ మీడియంలో రెండు సెక్షన్లు గా డివైడ్‍ చేశారు. అయితే వీరందరికి కేవలం 11 క్లాస్ రూంలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 4 క్లాస్ రూమ్ లు కూలిపోవడానికి సిద్ధంగావున్నా అందులోనే పాఠాలు చెబుతున్నారు. ఇటీవలే బిల్డింగ్‍ పై పెచ్చులు ఓ క్లాస్ రూంలో ఊడిపడి స్టూడెంట్స్ కి గాయాలయ్యాయి. దీంతో ఆ క్లాస్ రూంలో టీచింగ్‍ను టెంపరరీగా ఆపేసినట్టు టీచర్లు తెలిపారు. ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా స్కూల్ కు 20 క్లాస్ రూంలు అవసరమని టీచర్లు చెప్పారు.

ఇక్కడా అదే తీరు..
ఇక్కడి ప్రైమరీ స్కూల్ లో మొత్తం 320 మంది స్టూడెంట్స్ ఉన్నారు వీరందరికీ ఏడుగురు టీచర్లు మాత్రమే క్లాస్ లు చెబుతున్నారు. ప్రైమరీ స్కూల్ లో 320 మంది స్టూడెంట్స్ కి 5 క్లాస్ రూంలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 3 కూలిపోయే పరిస్థితి ఉన్నాయి.

ఫ్యాన్లు,లైట్లు కూడా లేవ్‌
విద్యార్థులందరికి సరిపోనూ తరగతి గదులు లేకపోవడంతో పాఠశాల ప్రాంగణంలోని చెట్ల కింద తరగతులను నిర్వహిస్తున్నారు ఫ్యాన్లు , లైట్లు లేకపోవడంతో చీకట్లోనే చదువుకుంటున్నామని విద్యార్థులు అంటున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులకు విన్నవించిన స్పందన లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates