కూల్ కూల్ : రాష్ట్రంలో చల్లబడిన వాతావరణం….పలు చోట్ల వర్షం

rainరాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. పదిరోజులుగా ఎండలతో అల్లాడుతున్న జనం.. కూల్ వెదర్ తో కాస్త రిలాక్సయ్యారు. నైరుతీ రుతుపవనాలు మరింత బలపడడంతో వానలు పడుతున్నాయని అంటున్నారు వాతావరణ అధికారులు. ఈనెల 25 తరువాత వానలు బాగా పడతాయని చెప్పారు. ఇప్పటికే చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయని… రేపు ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయంటున్నారు.
ఇవాళ ఉదయం నుంచి కొన్ని జిల్లాల్లో వాన పడింది.. మెదక్ లో 7 సెంటీమీటర్లు, మద్నూర్ లో 5, గాంధారి, బీమదేరవపల్లి, ఆత్మకూరు, శాయంపేట, జుక్కల్, లింగంపేటలో 3 సెంమీల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలో వానలు పడుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates