కూల్ గా కొట్టేశాడు : ధోనీ మరో రికార్డ్

MS RECORDSమిస్టర్ కూల్ ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది. IPL సీజన్-11లో తనదైన స్టైల్లో ఆకట్టుకుంటున్న ధోనికి మరో రికార్డు వరించింది. ఆదివారం (మే-20) పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు దక్కింది. కింగ్స్‌ పంజాబ్‌ తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌ లో మూడు క్యాచ్‌ లు అందుకున్న ధోని.. టీ20ల్లో (144) అత్యధిక క్యాచ్‌ లు అందుకున్న వికెట్‌ కీపర్‌ గా గుర్తింపు పొందాడు. దీంతో శ్రీలంక వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర(142) రికార్డును బ్రేక్ చేశాడు మిస్టర్ కూల్. 291 టీ20 మ్యాచ్‌ ల్లో ధోని ఈ ఘనతను సొంతం చేసుకోగా.. 264 మ్యాచ్‌ ల్లోనే సంగక్కర ఈ రికార్డును నమోదు చేశాడు. తరువాతి స్థానాల్లో మరో భారత వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ (139), కమ్రాన్‌ అ‍క్మల్‌(123), దినేశ్‌ రామ్‌ దిన్‌(111)లు ఉన్నారు.

బ్యాట్స్‌ మెన్‌ గా..
ఈ మ్యాచ్‌ లో 16 రన్స్ తో నాటౌట్‌ గా నిలిచిన ధోని మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. IPLలో 4 వేల పరుగులు పూర్తి చేసిన 7వ బ్యాట్స్‌ మన్‌ గా గుర్తింపు పొందాడు. అంతకు ముందు విరాట్‌ కోహ్లి(4 వేల 948), సురేశ్‌ రైనా (4 వేల931), గౌతం గంభీర్‌(4 వేల 217), రాబిన్‌ ఉతప్ప(4వేల81), డేవిడ్‌ వార్నర్‌(4 వేల014)లు ఉండగా.. 4007 పరుగులతో ధోని 7వ స్థానంలో నిలిచాడు. ఇక ఈసీజన్‌ లో వీరవిహారం చూపిస్తున్న ధోని 14 మ్యాచ్‌ ల్లో 30 సిక్స్‌లు, 23 బౌండరీలతో 446 పరుగులు చేశాడు. పంజాబ్‌ తో జరిగిన ఈ మ్యాచ్‌ చెన్నై 5 వికెట్ల తేడాతో గెలిచి.. పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మంగళవారం (మే-22) సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తో చెన్నై ముంబై వేదికగా ఫస్ట్ క్వాలిఫైర్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Posted in Uncategorized

Latest Updates