కూల్ గా.. హాట్ రేట్ : బీరు ధరలు పెరిగాయి

beerమద్యం ధరలను సవరించింది ఎక్సైజ్ శాఖ. ముఖ్యంగా బీరు రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. లైట్ బీరుపై రూ.10, స్ట్రాంగ్ బీరుపై రూ.20 చొప్పున పెంచుతూ జీవో విడుదల చేశారు. పెరిగిన బీరు ధరలు ఇవాల్టి నుంచే (మే 22) అమల్లోకి రానున్నాయి. ఒక్కో బీరుపై కనీస పెంపు రూ.10గా ఉండటం విశేషం. అసలు ఎండాకాలం.. బీర్లకు విపరీతమైన డిమాండ్. తయారు అయినవి తయారు అయినట్లే అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా బీర్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది.

బీర్లకు భారీ డిమాండ్ ఉన్న సమయంలో రేట్ల పెంపుతో మందుబాబులు షాక్ అయ్యారు. ప్రస్తుతం లైట్ బీరు రూ.90గా ఉంటే.. ఇక నుంచి రౌండ్ ఫిగర్ 100 అయ్యింది. స్ట్రాంగ్ బీర్ ప్రస్తుతం 110గా ఉంటే.. పెరిగిన ధరతో రూ.120కి చేరింది. ఇటీవల కాలంలో బీరు ధరలు పెంచటం ఇదే.

Posted in Uncategorized

Latest Updates