కూల్ వెదర్ : హైదరాబాద్ లో చిరు జల్లులు

v6-fb-Recovered-Recovered-Recovered

హైదరాబాద్ లో కూల్ వెదర్. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయ్యి ఉంది. ఎండ లేదు. మధ్యాహ్నం తర్వాత దట్టమైన మేఘాలతో సూర్యుడు కనిపించలేదు. వాతావరణం చల్లగా మారిపోయింది. సాయంత్రం ఆరు గంటల నుంచి సిటీలోని చాలా ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కూడా పడింది. చలికాలం వెళ్లిపోతూ.. ఎండకాలం ప్రారంభం సమయంలో ఈ జల్లులు పడ్డాయి. దీంతో ఇక నుంచి ఎండలు మొదలవ్వటానికే ఈ వాతావరణం మార్పు అనుకుంటున్నారు జనం.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో చిరు జల్లులు పడ్డాయి. ఉప్పల్, నాచారం, రామాంతాపూర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. 13వ తేదీ శివరాత్రి పండుగ ఉంది.

Posted in Uncategorized

Latest Updates