కృషికి గుర్తింపు : మెడిసిన్ లో ఇద్దరికి నోబెల్

మెడిసిన్, భౌతిక, కెమిస్ట్రి, సాహిత్యం, ఆర్థిక రంగాల్లో.. విశేష కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డుల కార్యక్రమం మొదలైంది. 2018 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ఇవాళ్టి (అక్టోబర్-1) నుంచి అనౌన్స్ చేయడం ప్రారంభించారు. ఫస్ట్ డే.. వైద్య శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. ఈ సంవత్సరం అమెరికా, జపాన్‌ కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్‌ ‌ను పంచుకుంటున్నారు.

జేమ్స్‌ పి అల్లిసన్‌(అమెరికా), తసుకు హోంజో(జపాన్‌)కు మెడిసిన్ లో నోబెల్‌ బహుమతి అందిస్తున్నట్లు అనౌన్స్ చేసింది స్టాక్‌ హోం(స్వీడన్‌) లోని నోబెల్‌ అసెంబ్లీ. క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం వీరు చేసిన రీసెర్చ్ లకు ఈసారి నోబెల్‌ బహుమతి ప్రకటించారు. క్యాన్సర్‌ కణాలపై పోరాడేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సాయపడుతుందని వీరు తమ అధ్యయనాలతో కనుగొన్నారు. అయితే కొన్నికారణాల వల్ల ఈ సారి సాహిత్యంలో నోబెల్‌ ఇవ్వట్లేదని తెలిపింది. భౌతిక శాస్త్రంలో మంగళవారం, రసాయన శాస్త్రంలో బుధవారం పురస్కారాలు ప్రకటించనున్నారు. అక్టోబరు 5 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబరు 8న ఆర్థిక రంగంలో నోబెల్‌ పురస్కారాల విజేతలను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది నోబెల్ అసెంబ్లీ.

Posted in Uncategorized

Latest Updates