కృష్ణానదిలో విషాదం : నలుగురు బీటెక్ స్టూడెంట్స్ గల్లంతు

pavithra-sangamamఏపీ రాష్ట్రంలో మరో ఘోరం. నలుగురు బీటెక్ స్టూడెంట్స్ గల్లంతు అయ్యారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ దగ్గర ప్రమాదం జరిగింది. ప్రవీణ్ (18), చైతన్య (18), శ్రీనాథ్ (19), రాజ్ కుమార్ (19) కంచికచర్లలోని మిక్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. జూన్ 23వ తేదీ శనివారం మధ్యాహ్నం కృష్ణానదిలో ఈతకు వెళ్లారు నలుగురు ఇంజినీరింగ్ స్టూటెంట్స్. ఫెర్రీ దగ్గర ఈత కోసం నదిలో దిగారు. ముందుగా ఓ స్టూడెంట్ నదిలోకి దిగగా.. అదుపు తప్పి కొట్టుకుపోయాడు. ఆ స్టూడెంట్ ను కాపాడేందుకు ప్రయత్నించిన మిగతా ముగ్గురు కూడా గల్లంతు అయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే NDRF బృందాలు రంగంలోకి దిగారు. నదిలో గాలిస్తున్నారు. ఇంచార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్పాట్ కు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతు అయిన స్టూడెంట్స్ ఆచూకీ వెంటనే దొరకాలని.. అందుకు కావాల్సిన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates