కృష్ణార్జున యుద్ధం సెన్సార్ పూర్తి

naniమేర్లపాక గాంధీ డైరెక్షన్ లో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్ 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలను మంగళవారం (ఏప్రిల్-10) పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి యూ/ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. కృష్ణుడు పాత్ర‌లో మాస్ లుక్‌ తో క‌నిపించ‌నున్న నాని, అర్జున్ పాత్ర‌లో రాక్‌స్టార్‌గా క‌నిపించ‌నున్నాడు.మూవీ రిలీజ్ టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు మేక‌ర్స్‌. ఈ క్ర‌మంలో సినిమాకి సంబంధించి వీడియో సాంగ్ ప్రోమోస్‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. మంగళవారం (ఏప్రిల్-10) ఐ వ‌న్నా ఫ్లై.. అనే సాంగ్   వీడియోని విడుద‌ల చేశారు. హిప్ హాప్ త‌మీజా మ్యూజిక్ లో రూపొందిన ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. శ్రీజో లిరిక్స్ అందించిన ఈ పాట‌ని ఎల్‌వీ రేవంత్‌, సంజీత్ హెగ్డే పాడారు.. మ‌రి ఈ వీడియో సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. నాని సరసన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్‌ హీరోయిన్లుగా నటించిన సంగ‌తి తెలిసిందే.


Posted in Uncategorized

Latest Updates